డ్రైక్లీనింగ్‌తో వైరస్‌ను పారదోలతాం
స్వైన్‌ఫ్లూపై మార్కెటింగ్ ఎత్తుగడలు
దేశంలో స్వైన్‌ఫ్లూ ఆందోళనల నెలకొనడంతో పలు కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్వైన్‌ఫ్లూ నిరోధించే కొత్త ఉత్పత్తులు, సేవలు అందిస్తామంటూ ప్రకటనలతో వూదరగొడుతున్నాయి. ఒక కంపెనీ అయితే ఏకంగా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే డ్రైక్లీనింగ్ మా వద్ద ఉందంటూ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇలాంటి వాటిని విశ్వసించవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సూక్ష్మజీవులను చంపే మందుతో బట్టలను డ్రైక్లీనింగ్ చేయిస్తే వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని డైమండ్ ఫ్యాబ్‌కేర్ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. ''స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని నిరోధించడానికి బట్టల్ని మీ ఇంట్లో ఉతుక్కోవడం కంటే డ్రైక్లీనింగ్‌కు ఇవ్వడం మేలు. వైరస్, ఇతర క్రిములను సంహరించేందుకు మేం.. కొంచెం ఎక్కువ మోతాదులో కీటకనాశనిని వాడుతున్నాం'' అని ఆ సంస్థకు చెందిన ఎ.శ్రీవాస్తవ చెప్పారు. మరోపక్క లిక్విడ్ సోప్‌కు, చేతులు కడుక్కునేందుకు వాడే జెల్ వంటి వాటికి గిరాకీ విపరీతంగా పెరిగిందని ఢిల్లీకి చెందిన ఓ మందుల దుకాణం నిర్వాహకుడు చెప్పారు. ''ఇంతకుముందు.. ఇలాంటి ఉత్పత్తుల సామర్థ్యంపై వంద ప్రశ్నలు గుప్పించే వినియోగదార్లు ఇప్పుడు స్వైన్‌ఫ్లూ దెబ్బకు విపరీతంగా కొనేస్తున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.
స్వైన్‌ఫ్లూ నేపథ్యంలో వస్తున్న మార్కెటింగ్ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రజలను హెచ్చరించింది. ''వైరస్‌ను డ్రైక్లీనింగ్ నిరోధిస్తుందని రుజువు చేస్తుందని ఏ అధ్యయనంలోనూ రుజువుకాలేదు'' అని మండలి డైరెక్టర్ వి.ఎం.కటోచ్ తెలిపారు. వాణిజ్య ప్రయోజనాల కోసం పలు కంపెనీలు చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్‌కు చెందిన ఎన్.కె.పాండే తెలిపారు.
స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి: స్వైన్‌ఫ్లూ వ్యాధితో పుణెలో ప్రియాంక షిమిల్కర్ అనే ఏడేళ్ల బాలిక మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 103కు చేరింది. దీనికితోడు వివిధ ప్రాంతాల్లో తాజాగా మరో 100 కొత్త కేసులు నమోదయ్యాయి.
డిసెంబర్‌లో టీకా కొనుగోలు: స్వైన్‌ఫ్లూ టీకా పరీక్షల అంశంలో భారత్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలను కేంద్రం ఖండించింది. భారతీయులపై ఈ టీకాను పరీక్షించడానికి ఒక కంపెనీ సంసిద్ధత వ్యక్తంచేసిందని వైద్య సేవల డైరెక్టర్ జనరల్ ఆర్.కె.శ్రీవాస్తవ తెలిపారు. గ్కాక్సో-స్మిత్‌క్త్లెన్ సంస్థ సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. నమూనాలను సేకరించే, పరీక్షించే, రవాణా చేసే సిబ్బందికి మొదట ఈ టీకాను ఇస్తామని వివరించారు. డిసెంబర్ నుంచి టీకాను గ్లాక్సో సంస్థ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందన్నారు.
మధుమేహం, గుండె జబ్బులు ఉంటే జాగ్రత్త: మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు, రక్తహీనత ఉన్న వారికి స్వైన్‌ఫ్లూ సోకితే పరిస్థితి విషమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీరు వ్యాధిని గుర్తించి, సరైన సమయంలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు. దేశంలో హెచ్1ఎన్1 వైరస్ వల్ల కలిగిన మరణాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోందని ఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ శివలాల్ తెలిపారు. 82 మరణాలను విశ్లేషించామని, ఇందులో 37 మంది అప్పటికే వారికి ఉన్న తీవ్రమైన వ్యాధులవల్ల పరిస్థితి విషమించి చనిపోయారని చెప్పారు.
రాష్ట్రంలో మరో 15 స్వైన్‌ఫ్లూ కేసులు
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తాజాగా మరో 15 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాధిబారిన పడ్డవారి సంఖ్య 195కి చేరింది. మంగళవారం ఐదుగుర్ని తీసుకొచ్చి ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో 25 ఏళ్ల యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్వైన్‌ఫ్లూ కేంద్రం సమన్వయకర్త శుభకర్ తెలిపారు. గత నెల 12న వ్యాధి నిర్ధరణ కోసం ఢిల్లీకి పంపిన నమూనాల్లో 10 మందికి వ్యాధి సోకినట్లు నివేదిక అందినట్లు ఆయన చెప్పారు.
స్వైన్‌పై ఆయుర్ యుద్ధం
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: స్వైన్‌ఫ్లూ వైరస్ వ్యాప్తిని ఆయుర్వేద మందులతో నియంత్రించవచ్చని విజ్ఞాన భారతి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి జయకుమార్ మంగళవారం తెలిపారు. ఆయుష్ పరిశోధన విభాగం, విజ్ఞాన భారతి సంయుక్తంగా స్వైన్‌ఫ్లూ వ్యాప్తి నియంత్రణకు పలు ఆయుర్వేద సూచనలు చేసిందన్నారు. నాలుగు సులభ పద్ధతులతో స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని నిరోధించవచ్చని ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గీతాకృష్ణన్ తెలిపారు.
ఇలా జాగ్రత్త పడదాం
ఎనిమిది మూలికలతో తయారు చేసిన అపరాజిత ధూపం రోజుకు రెండు సార్లు తరగతి గదులు, రద్దీ ప్రాంతాల్లో వేస్తే ఫ్లూ వ్యాప్తిని నియంత్రించవచ్చు.
నాలుగు గంటలకు ఒకసారి తిలా తైలాన్ని వాసన చూడటం ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు.
పసుపుకొమ్మును నేతిలో ముంచి, తర్వాత కాల్చగా వచ్చే పొగను ముక్కుతో పీల్చి నోటితో వదలాలి. దీంతో వైరస్ శరీరంలో ఉంటే వెంటనే చనిపోతుంది.
తులసిని తినడం వల్ల ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.

0 Comments:
Post a Comment
<< Home